సీసీఐని అదానీకి కట్టబెట్టే కుట్ర : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌‌‌‌‌‌‌ వెస్లీ

సీసీఐని అదానీకి కట్టబెట్టే కుట్ర : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌‌‌‌‌‌‌ వెస్లీ

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌లోని సిమెంట్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా ఫ్యాక్టరీని అదానీకి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే ఫ్యాక్టరీ పునరుద్ధరణలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌‌‌‌‌‌‌ వెస్లీ ఆరోపించారు. శుక్రవారం అఖిలపక్ష నాయకులతో కలిసి సీసీఐ ఫ్యాక్టరీని పరిశీలించి, గేటు వద్ద నిరసన తెలిపారు. అనంతరం సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ ఎదుట చేస్తున్న రిలే దీక్షలకు మద్దతు తెలిపి మాట్లాడారు. సీసీఐ భూములను వెంచర్లుగా మార్చే కుట్ర జరుగుతోందన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని, ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ శక్తులకు అప్పగించేందుకు ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. దేశ సంపద కొంత మంది చేతుల్లోనే ఉంటుండడంతో నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయన్నారు. కుల, మత ఘర్షణలు సృష్టిస్తూ శ్రామికవర్గ పోరాటాలను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. సీసీఐని పునరుద్ధరిస్తామని ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అమిత్‌‌‌‌‌‌‌‌షా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే సీసీఐని తెరిపిస్తామని స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ హామీనిచ్చారని.. ఇప్పుడు ఫ్యాక్టరీ తెరిపించకుంటే వారు పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు.

సీసీఐ కోసం రైతులు ఎకరానికి మూడు వేలకే భూములు ఇచ్చారని, ఇప్పుడు ఆ భూములు కోట్లు పలుకుతున్నాయన్నారు. సీసీఐని తిరిగి తెరిచేందుకు అన్నీ అనుకూలంగా ఉన్నాయన్నారు.రాష్ట్ర ప్రభుత్వం స్పందంచి సీసీఐ పునప్రారంభానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బండారు రవికుమార్, ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు శ్రీనివాస్, సీసీఐ సాధన కమిటీ కన్వీనర్‌‌‌‌‌‌‌‌ దర్శనాల మల్లేశ్‌‌‌‌‌‌‌‌, కో కన్వీనర్‌‌‌‌‌‌‌‌ నారాయణ, సభ్యులు ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, నంది రామయ్య, అజయ్, గుడిపెల్లి నగేశ్‌‌‌‌‌‌‌‌, సాజిద్‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌‌‌‌‌, బండి దత్తాత్రి, రాఘవులు పాల్గొన్నారు.